@b.raju_madal: 🥀💔 "వదిలి వెళ్లిపోయిన ప్రేమ..." 💔🥀 ================= నువ్వు నా జీవితంలోకి వచ్చినప్పుడు.. . నా ఒంటరితనానికి ముగింపు దొరికిందనుకున్నాను.. . ఇక నుంచి నా కన్నీళ్లకు కారణం ఉండదనుకున్నాను.. . కానీ.......!! ఇప్పుడు చూస్తే... నా కన్నీళ్లకు కారణం కూడా నువ్వే అయ్యావు... ప్రేమ అంటే ..... ఇద్దరూ కలిసి నడిచే దారి అనుకున్నాను... కానీ..... నువ్వు నేర్పింది వేరే... ప్రేమ అంటే ఒకరు జ్ఞాపకాలతో బతకడం... మరొకరు ఆ జ్ఞాపకాలనే మరిచిపోవడం అని... నువ్వు దూరమైన రోజు... నా జీవితంలో ఒక మనిషి మాత్రమే వెళ్లిపోలేదు... నా నవ్వు వెళ్లిపోయింది... నా ప్రశాంతత వెళ్లిపోయింది... నా మనసు కూడా నీతో పాటు వెళ్లిపోయింది... ఇప్పుడు నేను నవ్వుతున్నాను... మాట్లాడుతున్నాను... అందరితో కలిసిపోతున్నాను... కానీ అవన్నీ బయటికి కనిపించే నటన మాత్రమే... లోపల మాత్రం ప్రతి రోజు నీ జ్ఞాపకాల కింద నలిగిపోతూనే ఉన్నాను... ఒకప్పుడు నీ మెసేజ్ కోసం ఎదురుచూసిన ఈ కళ్ళు... ఇప్పుడు నీ జ్ఞాపకాలతోనే నిద్రపోతున్నాయి... ఒకప్పుడు నీ కాల్ వస్తే ఆనందంతో కొట్టుకున్న గుండె... ఇప్పుడు నీ గురించే గుర్తొచ్చి ముక్కలవుతోంది... నువ్వు నన్ను మర్చిపోయి ఉండొచ్చు... కానీ ..... నేను మాత్రం ఇంకా నువ్వు చెప్పిన మాటల మధ్యే బతుకుతున్నాను... నువ్వు ఇచ్చిన జ్ఞాపకాల మధ్యే నడుస్తున్నాను... నువ్వు లేని జీవితాన్ని జీవించడానికి ప్రయత్నిస్తున్నాను... కొన్నిసార్లు అనిపిస్తుంది... నిన్ను కలవకపోయి ఉంటే బాగుండేదేమో అని... కానీ వెంటనే నా మనసు చెబుతుంది... నీతో గడిపిన ఆ క్షణాలు లేకపోతే... జీవితంలో ప్రేమ ఎంత అందమో కూడా తెలిసేది కాదని... బాధ ఏంటో తెలుసా...? నువ్వు దూరమవడం కాదు... నువ్వు లేకుండా బతకడం అలవాటు పడిపోవడం... ఎందుకంటే.... ఒకరోజు నువ్వు లేకపోవడం కన్నా... ప్రతి రోజు నువ్వు లేవని గుర్తు చేసుకోవడమే ఎక్కువ బాధ.....నువ్వు గుండె పైన వాడు చెయ్యి వేసినప్పుడు... నాకు అసలు బాధ అనిపించలేదు... ఎందుకంటే....! ప్రేమ అంటే సంతోషంగా ఉండాలని మాత్రమే కోరుకుంటుంది... కానీ....! అదే గుండెలో ఒకప్పుడు ప్రపంచం మొత్తం మర్చిపోయి నిన్నే ప్రేమించిన ఈ పిచ్చోడు మనసును నువ్వు మర్చిపోయావని తెలిసినప్పుడు... ఆ బాధ మాత్రం నా ప్రాణం ఉన్నంత వరకు నాతోనే ఉంటుంది..... ఎప్పటికీ మానిపోని ఒక జ్ఞాపకం..!! 💖♥️ #RAJU b a l a p u r a m.. ❣️❤️🩹❤️🩹❣️ #realityoflovepain ..