@chintu2425: #తూర్పు గోదావరి జిల్లాలో దారుణం వెలుగు చూసింది. ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక యువకుడు ద్రోహం చేయడంతో.. న్యాయం కావాలంటూ ఒక యువతి తన పసిపాపతో కలిసి ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. ప్రేమ పేరుతో మోసం చేసిన ప్రియుడి నిజస్వరూపాన్ని బయటపెడుతూ, తనకు మరియు తన బిడ్డకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని తెగేసి చెప్పింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.